Triple E Virus : అమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ వైరస్
అరుదైన దోమల ద్వారా సంక్రమించే వైరస్ తో అమెరికా వణికిపోతోంది. ఈ వైరస్ సోకిన ఘటనలో ఈ ఏడాది తొలి మరణం నమోదైంది. ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫలైటిస్ (ఈఈఈ)గా పేర్కొంటున్న ఈ వైరస్ బారిన పడిన ఒక వ్యక్తి న్యూ హాంపైర్లో చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ రాష్ట్రంలో దశాబ్దకాలంలో జరిగిన తొలి వైరస్ మరణం అని, అమెరికాలో ఈ ఏడాది గుర్తించిన ఐదో కేసు అని అధికారులు పేర్కొన్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూ హాంప్ షైర్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దోమల వైరస్ ప్రబలినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రమైన మసాచుసెట్స్ లోని పలు ప్రాంతాలు ఈ వైరస్ కారణంగా హైఅలర్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ట్రిపుల్ ఈ వైరస్ అరుదైనది కానీ తీవ్రమైనదిగా అధికారులు చెప్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com