Trump : సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్

సుంకాలతో ప్రపంచ దేశాలను భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన దిగుమతి సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధి గా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత ట్రంప్... తమ పొరుగు దేశాలైన కెనడా, మెక్సికో దేశాలపై 25శాతం సుంకాలు విధించారు. ఈ టారిఫ్ లు ఫిబ్రవరి 4న అమలు కావాల్సి ఉండగా... మెక్సికో అధ్య క్షురాలు క్లాడియా షీన్ బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చల తర్వాత నెలరోజుల పాటు తాత్కాలికంగా ని లిపివేశారు. మార్చి 4న అమల్లోకి వస్తాయని, ఇందులో ఎలాంటా మార్పు లేదని ప్రకటించారు. ఆయన విధించిన సుంకాలు మార్చి 4న అమల్లోకి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ నిర్ణయం ఆయా దేశాల్లో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతి కూల ప్రభావం చూపిస్తుందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. తన నిర్ణయాలు మార్కెట్ సం క్షోభానికి కారణమయ్యాయనే సూచలను తోచి పుచ్చిన ట్రంప్, ప్రాంతీయ ఒప్పందం కిందకు వచ్చే కెనడా, మెక్సికో దేశాలపై సుంకాలు నిలిపి వేయాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com