Trump : మాట మార్చిన ట్రంప్

Trump : మాట మార్చిన ట్రంప్
X

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను భారత్ మట్టు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయా లని కోరారు. ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఓవల్ ఆఫీస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవ మానకరం. రెండు దేశాలపై వివాదం నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతోనూ నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తత లను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నా. అమెరికాతో భారత్, పాక్కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధం' అని అన్నారు. టెర్రరిజాన్ని అంతమొందించేం దుకు భారత్ కు అండగా ఉంటానని వారం రోజుల క్రితం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరా లే లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన మాట మార్చారు. ఇరు దేశాలూ తనకు సమానమేనని, సహాయం కోరితే అందుబాటులో ఉంటానంటూ వ్యాఖ్యా నించడం గమనార్హం.

Tags

Next Story