Donald Trump : భర్తపై ట్రంప్ వెటకారం.. నిక్కీ హేలీ సీరియస్
సుదీర్ఘ కాలం కొనసాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ (Trump) చేసిన పర్సనల్ వ్యాఖ్యలు వాదోపవాదాలకు దారితీశాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీలు పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం మరింత పెరిగింది. తాజాగా నిక్కీ హేలీపై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నిక్కీ నీ భర్త ఎక్కడంటూ పరిహాసంతో కూడిన వెటకారపు మాటలు వైరల్ అయ్యాయి.
డెమక్రాటిక్ అభ్యర్థి నిక్కీ హేలీ భర్త మేజర్ మైఖేల్ హేలీ (michael Haley) సైనికాధికారి. గత ఏడాది జూన్ నుంచి 'హార్న్ ఆఫ్ ఆఫ్రికా' ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రోజున దక్షిణ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ఆయన ప్రస్తావన తెచ్చారు. 'నిక్కీ భర్త ఎక్కడ? ఆయన దూరంగా ఉన్నారు. ఆమె భర్తకు ఏమైంది అంటూ ప్రశ్నించారు. యుద్ధోన్మాదులు, గ్లోబలిస్టుల అభ్యర్థి నిక్కీ అని ట్రంప్ ఫైరయ్యారు.
డొనాల్డ్ ట్రంప్ విమర్శలకు నిక్కీ సీరియస్ గా బదులిచ్చారు. ఏదైనా చెప్పాలనుకుంటే.. నా వెనుక కాకుండా.. చర్చా వేదికలో నా ఎదుటే చెప్పండి. సైన్యంలో నా భర్త సేవలు నాకు గర్వకారణం.. ట్రంప్ గుర్తుంచుకోండి అని నిక్కీ అన్నారు. 75 ఏళ్లు దాటిన వారికి రాజకీయాలు సరిపోవని.. ట్రంప్ కు మెంటల్ స్టేటస్ టెస్ట్ చేస్తే ఫెయిలవుతారని అన్నారు. ఒక సైనికుడి సేవలను ఎగతాలి చేస్తే అధ్యక్ష పదవి కాదు.. డ్రైవింగ్ లైసెన్సు పొందే నైతిక హక్కు కూడా ఉండదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సైనిక కుటుంబాలను పదే పదే అవమానించే వారు దేశ సర్వసైన్యాధిపతి పదవిని ఎలా చేపడతారని ఎదురు ప్రశ్నించారు నిక్కీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com