Trump : ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అధికారికంగా తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈలో పర్యటించనున్నారని వైట్‌హౌస్ వెల్లడించింది. ‘సాధారణంగా UKకు ముందు వెళ్తారు. కానీ నేను సౌదీకి వెళ్తున్నా. గత పర్యటన కంటే రెట్టింపు పెట్టుబడులు సాధించడమే లక్ష్యం’ అని ట్రంప్ వెల్లడించారు. కాగా అమెరికా కంపెనీల్లో $1ట్రిలియన్ పెట్టుబడులు పెడతామని సౌదీ హామీ ఇచ్చింది.
తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్‌కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా అమెరికాకు చెందిన నౌకలపై దాడులు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com