Donald Trump : అధ్యక్ష పదవికి ట్రంప్.. ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ ఖరారు..
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్ ట్రంప్ ( Donald Trump ) పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికకు పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది.
ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన ఒకరోజు తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారుకావడం విశేషం. కాల్పుల ఘటనలో గాయపడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెవికి బ్యాండేజ్ తోనే పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు పార్టీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. "ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాను. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు కూడా. యేల్ జర్నలిస్ట్ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన రచించిన 'హిల్టెల్లీ ఎలెజీ' పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త ఆయన"... అని ట్రంప్ పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com