TRUMP: అగ్రరాజ్య అధినేతా.. ఏమిటీ కోతల మోత

TRUMP: అగ్రరాజ్య అధినేతా.. ఏమిటీ కోతల మోత
X
పాకిస్థాన్ ఐ లవ్ యు అంటూ కామెంట్స్.. మళ్ళీ మోదీ నా దోస్త్ అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మిడిమిడి జ్ఞానం ఉన్న వారు ఇతన్ని గొప్ప లీడర్‌గా, ప్రపంచ ఉద్ధారకుడిగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కానీ.. ఈయన వ్యవహారాలతో కనీసం అమెరికాలోని తెల్ల జాతీయులు కూడా ప్రాథమికంగా సంతోషంగా లేరని తెలీదు. ఆయన ప్రసంగాలు అన్ని.. తాగిన తర్వాత గొప్పలకు పోయే మందుబాబులకు మించే ఉంటున్నాయి. యుద్దాలు ఆపాను అంటాడు.. కానీ ఎక్కడ యుద్ధం ఆగదు. మోదీ నా దోస్త్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎప్పుడు నా మద్దతు ఉంటది అంటాడు. కట్ చేస్తే.. పాక్ ఆర్మీ చీఫ్‌ని వేడుకులకు, డిన్నర్‌కి పిలుస్తాడు. ఐ లవ్ పాకిస్థాన్ అంటూ మురిసిపోతాడు. పాపం ఈయనకు నోబెల్ శాంతి బహుమానం ఎదో ఇస్తే రిటైర్మెంట్ తీసుకొని ప్రజలకు శాంతిని కలగజేస్తాడేమో.. అందుకైనా ఆయనకు నోబెల్ శాంతి బహుమానం ఇవ్వాల్సిందే.

ఒంటి నిండా విషమే

ట్రంప్ కేవలం పొగరుబోతు మాటలతో ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. అంతకు మించి అతడు చేసిందేంటో ఏ ప్రపంచ రాజకీయ విశ్లేషకుడిని అడిగిన ఏం చెప్పరేమో. భారత్‌ని కేవలం మార్కెట్‌గానే భావించే రేసిస్ట్ ట్రంప్‌ని మనం ఎప్పుడు మోయాల్సిన అవసరం లేదు. అతడు మెడలో దండాలు, సనాతన వస్త్రధారణ వేసుకొని భారత్‌ని మోసగించే క్రమంలో మనం ఉప్పొంగి పోవాల్సిన అవసరం అంత కంటే లేదు. అతడి అణువణువునా జాతి, వర్ణం అనే విషం నిండుకొని ఉంది. అమెరికా ప్రధాన శత్రువులలో ఒకటైన ఇరాన్‌కు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్న పాక్‌ని అతడు సపోర్ట్ చేస్తున్నాడు అంటే బహిరంగంగానే అతడి రంగు ఏంటో తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు ఇందిరా గాంధీ సహకరిస్తున్నప్పుడు ప్రెసిడెంట్ నిక్సన్ ఇట్లే బెదిరించాడు. ఇందిరా ఆగిందా!? ఆగలేదు. ఇండియా రూపాయి కన్నా.. బ్రిక్స్ కరెన్సీ విలువైనది. అందుకే బ్రిక్స్ కరెన్సీ వాడకం వద్దని ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు ట్రంప్. అందుకే ప్రజలు వివేకంతో ఆలోచిస్తే ప్రభుత్వాలు ప్రగల్భాలకు పోవు.

ఇంతకీ ఏం జరిగిందంటే...

భారత్, పాకిస్తాన్ సీజ్ ఫైర్ విషయంలో అమెరికా జోక్యం లేదని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా.. అని మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అలాగే ఐ లవ్ పాకిస్తాన్.. మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నిన్న రాత్రి అతనితో మాట్లాడాను..మేం భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం..పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను' అంటూ ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు భోజన విందుకు ఆతిథ్యం ఇవ్వనున్న కొన్ని గంటల ముందు అన్నాడు.నిక్సన్ లాంటి బలవంతమైన అధ్యక్షుడిని ఎదురుకున్న భారత్.. ట్రంప్ లాంటి ఒట్టి పొగరుబోతు మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. ఆ అవసరం నాయకులకు ఉన్న ప్రజలకు లేదు. ఈ విషయం అర్ధమైన రోజు.. పాలకుల ఆటలు చెల్లవు.

పెద్దన్నకు ఇరాన్ వార్నింగ్

ట్రంప్‌కి పెద్ద పెద్ద ఆర్థిక దేశాలు అమెరికాకు భయపడుతున్న.. అమెరికా అసలు రంగు తెలిసిన ఇరాన్ మాత్రం అసలు బెదరడం లేదు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్ హెచ్చరికలను ఉద్దేశిస్తూ.. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్‌ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందన్నారు. అంతేకాదు అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. అమెరికా శతృవు ఇరాన్‌కు పాక్ మిత్రడు.. పాక్‌కు ఏ విషయంలో ట్రంప్ ఐ లవ్ యు చెబుతున్నాడో అతడి స్నేహితులకు మాత్రమే అర్థం కావాలి. భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌ తేల్చిచెప్పారు.

Tags

Next Story