Donald Trump : టిక్ టాక్ పై ట్రంప్ కీలక ప్రకటన

టెక్ టాక్‌పై అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన విడుదల చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50శాతం వాటా పొందేందుకు అనుమతిస్తేనే టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేస్తామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా తమ దేశ పౌరుల డేటా చైనా ప్రభుత్వానికి చేరుతోందనే అనుమానంతో ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు టిక్ టాక్‌పై బ్యాన్ విధించింది. అయితే మరికొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడం సంచలనం రేకెత్తిస్తోంది.
టిక్ టాక్ సేవలు నిన్నటి నుంచి అమెరికాలో నిలిచిపోయాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని విధించిన ఫెడరల్ బ్యాన్ ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఆయన బాధ్యతల్లోకి రావడానికి ముందే టిక్ టాక్ సేవలు నిలిచిపోయాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో టిక్ టాక్ యూజర్లు 170 మిలియన్లు ఉన్నారు. బ్యాన్‌ను ఎదుర్కొంటున్న టిక్ టాక్ రీ ఎంట్రీ ఇస్తామంటూ ధీమాగా ఉంది. టిక్ టాక్ యాప్ అటు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ లలో అందుబాటులోకి లేకుండా పోయింది. అంతేకాదు యాప్ టచ్ చేసినప్పుడల్లా, త్వరలోనే డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాము ప్రవేశించేందుకు ప్రయత్నం చేస్తామని ఒక సందేశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చ మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com