Donald Trump : మస్క్‌కు మంత్రి పోస్ట్ ఇస్తా.. ట్రంప్ బంపరాఫర్
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు సంబంధించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను తిరిగి ఎన్నికవగానే మస్క తన కేబినేట్ లో చోటు కల్పిస్తానని మాటిచ్చారు. అలా కుదరని పక్షంలో వైట్ హౌస్ సలహాదారుడిగానైనా నియమిస్తానని ట్రంప్ చెప్పారు.
ఎక్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. విద్యుత్ వాహనాలపై ఇస్తున్న 7,500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. 2016లో గెలిచిన సమయంలో రెండు కీలక సలహా మండళ్లకు మస్క్ ను ఎంపిక చేశారు. అయితే, పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ రాజీనామా చేశారు. ట్రంప్ ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'డిపార్ట్మెంట్ అఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ'కి నేతృత్వం వహించేందుకు రెడీగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com