Trump : విదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు.. అమెరికన్లపై భారం

Trump : విదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు.. అమెరికన్లపై భారం
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లతో ఆ దేశ ప్రజలపై భారం పడనుంది. అగ్రరాజ్యం కాఫీ గింజల నుంచి కార్ల వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. తాజా టారిఫ్‌లతో కార్ల ధరలు సగటున 2,500 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే, అమెరికాకు దుస్తులు ఎగుమతి చేస్తున్న చైనా, వియత్నాం, బంగ్లాపైనా టారిఫ్‌లు పెంచడంతో వాటి ధరలూ పెరగనున్నాయి. మద్యం, ఇంధనం, కాఫీ గింజలు, కొన్నిరకాల పండ్ల ధరలు ప్రియం కానున్నాయి.

అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.

Tags

Next Story