Trump : ట్రంప్ సుంకాలు.. సిరియాపై అత్యధికంగా 41 శాతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య విధానంలో భాగంగా సిరియాపై అత్యధికంగా 41 శాతం సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. • ట్రంప్ సుమారు 70 దేశాలపై కొత్తగా సుంకాలను విధిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ టారిఫ్‌లు 'రిసిప్రోకల్ టారిఫ్' (పరస్పర సుంకాల) సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి. కొత్తగా విధించిన సుంకాల్లో సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించారు. సిరియా తర్వాత లావోస్, మయన్మార్ (40 శాతం), స్విట్జర్లాండ్ (39 శాతం), ఇరాక్, సెర్బియా (35 శాతం), అల్జీరియా, లిబియా, సౌతాఫ్రికా (30 శాతం) వంటి దేశాలపై కూడా భారీగా సుంకాలు విధించారు. భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అలాగే, బ్రెజిల్‌పై 50 శాతం, కెనడాపై 35 శాతం సుంకాలు విధించారు. తన "అమెరికా ఫస్ట్" నినాదానికి అనుగుణంగా, అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ తయారీ రంగాలను ప్రోత్సహించడం మరియు ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను తిరిగి సమతుల్యం చేయడమే ఈ సుంకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com