Trump : ఎన్నికల్లో ఖర్చేమో గానీ.. ట్రంప్ సంపద డబుల్ అయింది

Trump : ఎన్నికల్లో ఖర్చేమో గానీ.. ట్రంప్ సంపద డబుల్ అయింది
X

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్ోల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నికర సంపద అకస్మాత్తుగా మొన్నటి అక్టోబర్ లో డబుల్ అయింది. రూ.33 వేల కోట్ల రూ.67 వేల కోట్లకు పెరిగిపోయింది. ఫోర్బ్స్ 'రియల్ టైం బిలియనీర్స్ ట్రాక్టర్' ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 357వ స్థానంలో ట్రంప్ ఉన్నారని తెలిపింది. 'ట్రూత్ సోషల్' పేరుతో ఒక సోషల్ మీడియా సంస్థను ట్రంప్ నడుపుతున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తోంది. తాజాగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేరు ధర దాదాపు 9 శాతం పెరిగి రూ.4,288కి చేరింది. అందుకే ట్రంప్ నికర సంపద విలువ అమాంతం డబుల్ అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజులే టైం మిగిలింది. నవంబరు 5న పోలింగ్ జరగనుంది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తో హోరా హోరీగా ట్రంప్ తలపడుతున్నారు. ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువేనని సర్వేలు చెబుతున్నాయి.

Tags

Next Story