China : ట్రంప్ మాటలన్నీ ఉత్తివే: చైనా

China : ట్రంప్ మాటలన్నీ ఉత్తివే: చైనా
X

చైనా ఉత్పత్తులపై అమెరికా 145% టారిఫ్ లు ప్రకటించడంతో ఇరుదేశాల మధ్య ట్రేడ్వార్ తారస్థాయికి చేరింది. ఈ సుంకాలు తగ్గించడానికి డ్రాగన్ కంట్రీతో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మాటలను తాజాగా బీజింగ్ ఖండించింది. అగ్రరాజ్యంతో తాము ఎలాంటి వాణిజ్య చర్చలు జరపడంలేదని క్లారిటీ ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువోజియాకున్ మాట్లాడుతూ.. 'చైనా అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు సంబంధించిన సంప్రదింపులేవీ జరగడం లేదు. మా మధ్య ఎలాంటి చర్చలు లేవు. వాణిజ్య ఒప్పందం చేసుకోలేదు' అని పేర్కొన్నారు. ఈసందర్భంగా టారిఫ్ లపై చర్చల కు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, అవి పరస్పర గౌరవం, సమాన త్వంతో ముడిపడి ఉంటాయన్నారు.

Tags

Next Story