Destroy Iran : ఇరాన్ ను నాశనం చేస్తారా.. ట్రంప్ ప్రకటనతో ప్రకంపనలు

ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నాయి. కేవలం సైనిక స్థావరాల మీదనే కాకుండా.. పబ్లిక్ ప్లేసులు, ప్రభుత్వ ఆస్తులను సర్వనాశనం చేస్తున్నాయి. పవర్, రోడ్లు, నీరు, ఇంటర్నెట్ తో పాటు ఇరాన్ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి ఈ రెండు దేశాలు. అయితే నిన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అమెరికాకు లొంగిపోయేది లేదని.. ధీటుగా పోరాడుతామన్నారు. ట్రంప్, నెతన్యాహు సమాధుల దాకా మా పోరాటం కొనసాగుతుంది అంటూ ప్రకటించారు. ఆయన ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ తో ఒప్పందాలు, చర్చలు ఏమీ లేవని.. ఇరాన్ ను సర్వనాశనం చేస్తామని ప్రకటించారు. దీంతో యుద్ధం మరింత భయంకరంగా మారుతోంది. నిన్నటి నుంచి యుద్ధం అత్యంత భయంకరంగా సాగుతోంది.
అటు ఇరాన్ కూడా తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై ఇకపై దాడులు చేయబోమని ప్రకటించింది. కానీ ఆ దేశాల నుంచి అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తే మాత్రం.. ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఈ యుద్ధంలోకి చాలా దేశాల ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ పూర్తిగా ఆగిపోయాయి. గల్ఫ్ దేశాల నుంచి ఎలాంటి ఆయిల్ ఎగుమతులు ఉండట్లేదు. ఇదే అదునుగా అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు కూడా భీకరంగా సాగుతున్నాయి. ఇలా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు అత్యంత భయంకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ తగ్గకపోవడంతో యుద్ధం తీవ్రత మరింత పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక శక్తిని మూకుమ్మడిగా ఎదుర్కునే సామర్థ్యం ఇరాన్ కు లేకపోయినా.. వెనక్కు తగ్గట్లేదు. భీకరంగా ప్రతి దాడులు చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలోకి రష్యా, చైనాలను లాగాలని అగ్రరాజ్యం చూస్తోంది. మరి ఆ దేశాలు వచ్చినా రాకపోయినా.. ఇరాన్ ను మరింతగా నష్టపరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధం అయినట్టు కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
