US : డజను కోడిగుడ్లు రూ.536.. ఎక్కడంటే

US : డజను కోడిగుడ్లు రూ.536.. ఎక్కడంటే
X

అమెరికాలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. తాజాగా డజను కోడిగుడ్ల ధర ఏకంగా రూ.536 (6.23 డాలర్లు)కు చేరింది. బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో 3 కోట్ల కోళ్లను నిర్మూలించడం, దిగుమతులూ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో సాధారణంగా గుడ్ల ధరలు ఈస్టర్‌ దినమైన ఏప్రిల్‌ 20 వరకు పెరుగుతాయి. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి 3 కోట్ల గుడ్లుపెట్టే కోళ్లను ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో నిర్మూలించడంతో గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బర్డ్‌ ఫ్లూ వచ్చినప్పటి నుంచి అమెరికాలో 16.80 కోట్ల కోళ్లను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వధించారు. వీటిలో అత్యధికం గుడ్లు కోసం పెంచే కోళ్లే. చాలా కోళ్ల ఫారాలను శానిటైజ్‌ చేసి మళ్లీ మెల్లగా గుడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నారు.

Tags

Next Story