UAE 140 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది

అబుదాబిలో (Abu Dhabi) బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ లేదా BAPS (Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha) సొసైటీ నిర్మించిన విశాలమైన హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా పూజారులతో కలిసి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత, "కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినందుకు" యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
27 ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఇది అబుదాబిలోని మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం. ఇది భారతీయ సంస్కృతి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గుర్తింపు ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. "ఈ గొప్ప ఆలయాన్ని సాకారం చేయడంలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన పాత్ర ఎవరిదైనా ఉందంటే, అది నా సోదరుడు హిస్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ తప్ప వేరెవరూ కాదు" అని ప్రధాని మోదీ అన్నారు.
ఇప్పటివరకు బుర్జ్ ఖలీఫా, ఫ్యూచర్ మ్యూజియం, షేక్ జాయెద్ మసీదు లాంటి ఇతర అత్యాధునిక భవనాలకు పేరుగాంచిన యూఏఈ ఇప్పుడు తన గుర్తింపుకు మరో సాంస్కృతిక అధ్యాయాన్ని జోడించిందని ప్రధాని మోదీ అన్నారు. "రాబోయే కాలంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారన్న నమ్మకం తనకుందని.. దీని వల్ల యూఏఈకి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని, ప్రజల మధ్య కనెక్టివిటీ కూడా పెరుగుతుందని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com