UKRAINE: రష్యా సబ్‌మెరైన్‌ను ముంచేసిన ఉక్రెయిన్ !

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు దాదాపు 75 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని మాస్కో ప్రకటించింది. అయితే రష్యాలోని కీలక స్థావరాలను ధ్వంసం చేశామని... వైమానిక స్థావరాన్ని నాశనం చేశామని ఉక్రెయిన్ తెలిపింది. సెవస్తొపోల్ నౌకాశ్రయంలో రష్యా జలాంతర్గామిని ముంచేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. రష్యా సబ్‌మెరైన్ నల్ల సముద్రంలో అడుగులో కూరుకుపోయిందని తెలిపింది. అయితే ఒక డ్రోన్‌ను అజోవ్ సముద్రంలో కూల్చేశామని, రొస్తోవ్ ప్రాంతంపై 55 డ్రోన్లు దండెత్తగా వాటిలో 36 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. రొస్తోవ్, బెల్గొరద్, కుర్‌స్క్‌లలో చమురు డిపోనూ, మందుగుండు గిడ్డంగులనూ, మోరొజోవ్ స్క్‌లో ఒక వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ శనివారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. చమురు డిపోపై దాడి జరిగిన మాట నిజమే కానీ, మంటలను వెంటనే ఆర్పివేశామని రష్యా తెలిపింది. మరోవైపు, క్రిమియాలోని సెవస్తొపోల్ నౌకాశ్రయంలో శత్రు దేశానికి చెందిన ఓ జలాంతర్గామిని ముంచేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఆ సబ్‌మెరైన్ నల్ల సముద్రం అడుగుకు పడిపోయినట్లు వెల్లడించింది. క్రిమియాలో మోహరించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థకు చెందిన నాలుగు లాంచర్లనూ తీవ్రంగా దెబ్బతీసినట్లు కీవ్ తెలిపింది.
అమెరికాకు అండగా ఇజ్రాయెల్
హమాస్ రాజకీయవేత్త ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో.. ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ సిద్దమవుతున్నది. ఈ వారాంతంలో భారీ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాశ్చ్య ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరిస్తోంది. టెహ్రాన్ చేపట్టే దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్స్‌ను అమెరికా మోహరిస్తున్నది. అమెరికా సిబ్బందిని, ఇజ్రాయిల్‌ను డిఫెండ్ చేయాలన్న ఉద్దేశంతో పెంటగాన్ ఈ చర్యలకు దిగింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డెస్ట్రాయర్లను కూడా అమెరికా మోహరిస్తున్నట్లు పెంటగాన్ అధికారులు చెప్పారు.
భారతీయులకు అడ్వైజరీ..
టెల్ అవివ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఓ అడ్వైజరీ రిలీజ్ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సేఫ్టీ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొన్నది. ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో అడ్వైజరీ పోస్టు చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు. ఇద్దరు సీనియర్ హమాస్ నేతలతో పాటు హిజ్‌బుల్లా కమాండర్‌ను కూడా చంపిన ఘటన నేపథ్యంలో భారతీయ ఎంబసీ ఈ ప్రకటన ఇచ్చింది. టెలిఫోన్ నెంబర్లను కూడా రిలీజ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com