UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి

UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి
X
పరిస్థితి మరింత దిగజారనివ్వొద్దని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ సూచన

పహల్గామ్ దాడి భారత్, పాకిస్తాన్ ల మధ్య పరిస్థితిని మార్చేసింది. దీనిలో ఇండియాలో 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారత్ కోపంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. దీనిని నెమ్మది చేయాల్సిన పాకిస్తాన్ మరింత ఎగదోస్తోంది. బార్డర్ లో దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. ఇండియా కూడా వార్ తప్పదేమోననే ఆలోచనలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్ , పాకిస్తాన్ లు రెండూ సంయమనం పాటించాలని యూఎస్ కోరింది. పరిస్థితి మరింత దిగజారనివ్వొద్దని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ ఆంటోనియో గుట్రెస్ పిలుపునిచ్చారు. కాశ్మీర్ లో జరిగిన దాడిని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని గుట్రెస్ కోరారు.

భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్య చేసింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై ఓ క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసింది. ఇది భారతీయ నావికా దళ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పవాల్గామ్‌లో టెర్రర్ అటాక్ కారణంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు రద్దు అవుతున్నాయి.

Tags

Next Story