Iran : ఇరాన్ లో భూగర్భ క్షిపణి నగరం.. షాకింగ్ వీడియో రిలీజ్

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ తన ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. 85 సెకన్ల నిడివిగల ఈ క్లిప్‌లో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది. ఇరాన్‌కు చెందిన సాయుధ బలగాల అధిపతి హోస్సెనీ పఘేరి, రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ హజిజాద్ ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ, ఆయుధాలను వీక్షించారు. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, ఘద్రహస్, సెజ్జిల్స్, హజ్ ఖాసీమ్స్, పవేహ్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. ఈ వీడియోను ఇరాన్ పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇందులో పొడవైన సొరంగాలు, గుహలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాతో పరోక్షంగా చర్చలకు తాము సిద్ధమని ఇరాన్ సంకేతాలిచ్చింది. అదే సమయంలో ప్రత్యర్థుల వైఖరిలో మార్పు రానంతవరకు ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని తేల్చిచెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com