US: మోదీకి బైడెన్ ఆహ్వానం...

US: మోదీకి బైడెన్ ఆహ్వానం...
అమెరికా పర్యాటనకు మోదీని ఆహ్వానించిన బైడెన్, ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని

భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా బైడెన్ పంపిన ఆహ్వానాన్ని మోదీ కూడా మన్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల అధికారులు ఇరువురికి సౌకర్యంగా ఉన్న తేదీలను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశం ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో సెప్టెంబర్ లో జరగబోయే జీ-20 సమావేశాలకు సంబంధించి వరుస కార్యక్రమాలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని కార్యక్రమాలకు బైడెన్ స్వయంగా హాజరవ్వనున్నారు. ఈ క్రమంలో జున్ లేదా జులైలో ఇరువురి భేటీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే బైడెన్ ఆహ్వానం ఎప్పుడు పంపించారు, ఎవరు మోదీకి చేరవేశారు అన్న అంశాలు మాత్రం తెలియరాలేదు. పీఎంఓ అధికారులు ప్రస్తుతం ఈ అంశం గురించి మాట్లాడలేమని స్పష్టం చేశారు. అయితే గతేడాది బైడెన్ ఇదే విధంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన కనీసం రెండు రోజులు సాగేట్లు కనిపిస్తోంది. అమెరికా కాంగ్రెస్ లో జాయింట్ సెషన్ తో పాటూ, వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ లో మోదీ పాలుపంచుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ మోదీ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు చేశారు. అయితే అసెంబ్లీ ఎలెక్షన్లకు ముందు మోదీ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story