US: అమెరికాలో హత్య..పట్టుబడ్డ తెలుగబ్బాయ్

X
By - Subba Reddy |7 Feb 2023 12:30 PM IST
మోంట్ గోమెరీలో జరిగిన కాల్పుల్లో అనుమానితుడిగా భావించి అరెస్ట్
అమెరికాలో తెలుగు యువకుడిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఆ యువకుడిని అమెరికా పోలీసులు ఇటీవల జరిగిన మర్డర్‌కు సంబంధించి అనుమానితుడిగా భావించి అరెస్టు చేశారు. మోంట్ గోమెరీలో నివాసముంటోన్న అఖిల్‌సాయి(25) ఆదివారం సాయంత్రం తన ఇంటి పరిసరాల్లో కాల్పులకు గురయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స మధ్యలోనే అఖిల్‌సాయి మృతి చెందాడు. ఆ సంఘటన చోటుచేసుకున్నప్పుడు రవితేజ గలీ(23) అనే యువకుడు అక్కడే ఉన్నాడు. రవితేజ కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్థుతం రవితేజ మోంట్‌గోమెరీ డిటెన్షన్ ఫెసిలిటీ కస్టడీలో ఉన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com