America: ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్

ఉక్రెయిన్ పోరాట పటిమ మరింత మెరుగుపడనుంది. అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాలు ఆ దేశ అమ్ములపొదిలో చేరనున్నాయి. డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఈ యుద్ధవిమానాలు నిర్దిష్టంగా ఉక్రెయిన్కు ఎప్పుడు అందేవీ, రష్యాతో యుద్ధంలో ఎప్పుడు పాల్గొనేవీ ప్రస్తుతానికి తెలియరాలేదు.
వాటిని ఉపయోగించాలంటే ఉక్రెయిన్ పైలట్లు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారి శిక్షణ పూర్తయిన తర్వాత ఎఫ్-16 విమానాలను అక్కడ మోహరిస్తారు. రష్యా వైమానిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ చాలా కాలంగా యూఎస్ తయారు చేసిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌లకు పిలుపునిచ్చింది.ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా స్పష్టమైన హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రష్యాతో ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలో వాటి ప్రభావం కనిపించే అవకాశాలు లేవు.సోవియట్ యూనియన్ కాలం నాటి పాత యుద్ధవిమానాలనే ప్రస్తుతం యుద్ధంలో ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. ఫలితంగా దాని గగనతల పోరాట సామర్థ్యాలు బాగా బలహీనంగా కనిపిస్తున్నాయి. ఎఫ్-16ల చేరికతో ఆ బలం పెరగనుంది. ఈ యుద్ధవిమానాలు అమెరికాలో తయారవుతుంటాయి. కొనుగోలు చేసిన దేశమేదైనా.. ఇతర దేశాలకు వాటిని అందజేయాలనుకుంటే అమెరికా నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
ఉక్రెయిన్‌కి చెందిన మిలటరీ డ్రోన్ శుక్రవారం సెంట్రల్ మాస్కోలోని ఓ భవనంపై కూలిపోయింది. రష్యా వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను కూల్చివేయడంతో ఈ ఘటన జరిగినట్లు మాస్కో మేయర్ సెర్గీ తెలిపారు. ఈ ఘటనలో భవనం ధ్వంసం కాగా, ఆకాశంలో భారీ ఎత్తున పొగకమ్మేసిన దృశ్యాలు స్థానిక మీడియాలో వైరలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com