Rishi Sunak: సునాక్ గెలుపు కోసం ప్రవాస భారతీయుల హోమాలు..
Rishi Sunak:ఇద్దరు హేమాహేమీలు బరిలో నిలిచారు.. ఎవరు బ్రిటన్‌ను ఏలబోతున్నారు. అందరిలో ఉత్కంఠత నెలకొంది. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నరిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య పోటీ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఈ రేసులో సునాక్ కంటే లిజ్ కాస్త ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో యూకేలోని ప్రవాసభారతీయులు సునాక్‌కు మద్ధతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అతడు గెలవాలని పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.
సునాక్ మావాడని ఈ పూజలు, హోమాలు నిర్వహించట్లేదు.. ప్రధాని పదవికి ఆయన అత్యంత సమర్ధుడు. బ్రిటన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించేది ఆయనే అని నమ్ముతున్నాం అని బ్రిటీష్ ఇండియన్ ఒకరు అంతర్జాతీయ మీడియాతో అన్నారు. యూకేలో ఉన్న మైనారిటీల్లో అత్యధికులు ప్రవాస భారతీయులు. అధికారిక లెక్కల ప్రకారం.. బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారత సంతతికి చెందిన వారున్నారు. దేశంలో మొత్తం జనాభాలో వీరి సంఖ్య 2.5 శాతంగా ఉంది.
ఇటీవల వెలువడిన సర్వేల ప్రకారం సునాక్ కంటే లిజ్ రెండంకెల మెజార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో సునాక్‌కు అధిక మద్దతు ఉన్నప్పటికీ టోరీల్లో ఎక్కువ మంది లిజ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు అందుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ టీవీ డిబేట్‌లో అనూహ్యంగా లిజ్‌పై సునాక్ విజయం సాధించడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని లిజ్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వినిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com