Alien Craft: ఏలియన్స్‌ నిజాలను దాస్తున్న అమెరికా

Alien Craft: ఏలియన్స్‌ నిజాలను దాస్తున్న అమెరికా
X
ఏలియన్స్‌ విషయాలను అమెరికా దాచిపెడుతుందన్న నిఘా అధికారి... అమెరికా పార్లమెంట్‌కు ఆధారాలను సమర్పణ

ఏలియన్లు ఉంటాయనే ప్రచారం జరిగే ఫ్లయింగ్ సాసర్లు(UFO)లపై తమ దేశం కొన్ని విషయాలను దాచిపెడుతోందని(US Hiding Info On Alien Craft) అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్(David Grusch) బాంబు పేల్చారు. అమెరికా పార్లమెంటు కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చిన ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు. UFOలను UAP‍(unidentified anomalous phenomenon)లుగా అమెరికాలో పిలుస్తారు. టాస్క్ ఫోర్స్ మిషన్ కు సంబంధించిన అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను గుర్తించమని UAPలపై ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ అధిపతి( American authorities) తనను 2019లో అడిగారని గ్రుష్ చెప్పారు.

ఆ సమయంలో US గూఢచారి ఉపగ్రహాలను నిర్వహించే నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ కు ఈ విషయాన్ని వివరించినట్లు ఆయన చెప్పారు. UAP క్రాష్ రిట్రీవల్, రివర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌కు తనకు అనుమతి రాలేదన్నారు. గ్రహాంతర వాసుల గురించి అమెరికా ప్రభుత్వం వద్ద సమాచారం ఉందా అనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేసింది. 1930ల నుంచే మానవేతర కార్యకలాపాల గురించి అమెరికా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు డేవిడ్ గ్రుష్ వాదనలను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఖండించింది. గ్రహాంతర వాసులు, వారికి వస్తువుల ఉనికిపై ధ్రువీకరించదగిన సమాచారం పరిశోధకులు కనుగొనలేదని పేర్కొంది.


మనుషులే కాదు ఇతర గ్రహాలపైనా జీవులు ఉన్నాయని ఇందుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని డేవిడ్ గ్రుష్ తెలిపారు. అందులో నుంచి సేకరించిన మానవేతర అవశేషాలపై సైతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిఘా వర్గాలు గతంలోనే ప్రభుత్వానికి సమర్పించాయని తెలిపారు. క్రాష్డ్‌ క్రాఫ్ట్స్‌, దాని పైలట్లు నిజమేననని ఆయన సమాధానం ఇచ్చారు. దీని గురించి తనకు ప్రత్యక్ష సమాచారం ఉందని తెలిపారాయన.దశాబ్దాలుగా ఇందుకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు.

జూన్‌లోనే ఆయన అమెరికా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో రిపబ్లికన్‌ కమిటీ ఒకటి ఆయన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే.. తాను ప్రత్యక్షంగా వాటిని చూడకపోయినప్పటికీ, హైలెవల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల నుంచి తనకు సమాచారం ఉందని తెలియజేశారు. ప్రభుత్వం మాత్రం సాక్ష్యాలను దాచిపెడుతుందన్న గ్రుష్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. పరిశోధకులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని రక్షణ అధికారి ఒకరు తెలియజేశారు.

Tags

Next Story