అంతర్జాతీయం

US corona : ఒమిక్రాన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న అమెరికా, యూరప్‌

US corona : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాలు.. ఒమిక్రాన్‌ దెబ్బకు విల్లవిల్లాడిపోతున్నాయి.

US corona : ఒమిక్రాన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న అమెరికా, యూరప్‌
X

US corona : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌ దేశాలు.. ఒమిక్రాన్‌ దెబ్బకు విల్లవిల్లాడిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో.. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే అమెరికాలో 11లక్షల కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు జనవరి 3న ఒకేరోజు 10లక్షల కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు ఆస్పత్రి చేరికలు కూడా భారీగా పెరిగాయి. ఒకేరోజు లక్షా 35వేల మంది ఆస్పత్రిలో చేరడం అమెరికా ఆరోగ్య విభాగాన్ని కంగారు పెడుతోంది. వాషింగ్టన్ డీసీ, విస్కాన్‌సిన్‌, వర్జీనియా, డెలావేర్‌, ఇలినోయిస్‌, మేరీల్యాండ్‌, మిస్సౌరి, పెన్సిల్వేనియాతోపాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయి. దీంతో నర్సులు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకినా.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు విధులకు హాజరవ్వాలని ఆస్పత్రులు ఆదేశించడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

Next Story

RELATED STORIES