Donald Trump : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలపై టారిఫ్ విధించి అందరికీ ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో ఇంపోర్ట్స్ పై 25%, చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇవి మంగళవారం నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. దేశీయ తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందు కు ఆ సుంకాలను ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమవల సలను నిరోధించి దేశ ప్రజలకు మెరుగైన భద్రతను ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
డబ్ల్యూటీవోలో తేల్చుకుంటం
చైనా మూడు దేశాల దిగుమతులపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ విధించిన కొన్ని గంటల్లోనే కెనడా ప్రధాని ట్రూడో కౌంటర్ ఇచ్చారు. 155 బిలియన్ డాలర్ల యూఎస్ వస్తువులపై 25% సుంకాలను విధించనున్నట్లు అనౌన్స్చేశారు. మరోవైపు.. మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్ లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు. మరోవైపు చైనాపై సుంకాలు విధించాలన్న ట్రంప్ నిర్ణయం పై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండి పడింది. దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా సంగతి డబ్ల్యూటీవోలో చూసుకుంటా మని వార్నింగ్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com