US - India: భారత్‌కు అండగా ఉండాలంటే.. పాక్‌కు సహాయాన్ని నిషేధించాలి

భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని అమెరికన్ కాంగ్రెస్‌లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం బిల్లు ప్రవేశ పెట్టారు. అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లులో ఆయన ప్రతిపాదించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది.. ఇందులో నిజం ఉందని తేలితే పాకిస్థాన్‌కు భద్రతా సహాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని మార్కో రుబియో స్పష్టం చేసింది.
అయితే, మరోవైపు ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణ వైఖరిని అనుసరిస్తోందని అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టిన బిల్లు స్పష్టం చేస్తుంది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా సవాల్ చేస్తుందని మార్కో రుబియో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీని అడ్డుకోవాలంటే భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇక, అమెరికాలో నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతుంది. ఈ తరుణంలో బిల్లు గట్టెక్కడం కష్టమని నిపుణులు చెప్పుకొస్తున్నారు. భారత్‌తో సంబంధాల విషయంలో ఇరు పార్టీలూ సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చే ఛాన్స్ ఉంది అని నిపుణులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com