US-Pakistan : పాకిస్థాన్ కు అమెరికా షాక్.. నాలుగు సంస్థలపై ఆంక్షలు

US-Pakistan : పాకిస్థాన్ కు అమెరికా షాక్.. నాలుగు సంస్థలపై ఆంక్షలు
X

మన దాయాది దేశం పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాలను తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ (ఎన్ డీసీ) కూడా ఉంది. ఇది పాక్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఇది జనాలు భారీగా గుమికూడిన ప్రాంతాల్లో పేలుడు జరిపి భీకరమైన మారణహోమం సృష్టించే ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది.

Tags

Next Story