U.S. Tariffs : చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు

U.S. Tariffs : చైనాపై 145శాతానికి చేరిన అమెరికా సుంకాలు
X

చైనాపై అమెరికా విధించిన మొత్తం సుంకాలు 145 శాతానికి చేరాయి. వాస్తవంగా టారిఫ్‌ల పర్సంటేజీ 125 శాతానికి చేరింది. అయితే గతంలో ఫెంటానిల్ అక్రమ రవాణా కాకుండా విధించిన 20 శాతాన్ని అమెరికా తాజాగా గుర్తుచేసింది. దానితో కలిపి మొత్తం టారిఫ్‌లు 145శాతానికి చేరుకున్నాయని ట్రంప్ యంత్రాంగం వివరించింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకాల్ని విధించిన సంగతి తెలిసిందే. చైనా దిగుమతులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. అమెరికా చర్యలకు దీటుగా స్పందిస్తున్న చైనా.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. బీజింగ్‌ చర్యపై తీవ్రంగా ప్రతిస్పందించిన ట్రంప్‌.. చైనాపై టారిఫ్‌లను ఇటీవలే ఏకంగా 125శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాపై విధించిన సుంకాలు మొత్తంగా 145 శాతానికి చేరుకున్నట్లు వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Tags

Next Story