US Tariffs : నేటి నుంచి అమల్లోకి అమెరికా టారిఫ్స్

US Tariffs : నేటి నుంచి అమల్లోకి అమెరికా టారిఫ్స్
X

భారత ఎగుమతులపై యూఎస్ టారిఫ్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికాకు ఎగుమతి చేస్తున్న అన్ని వస్తువులపై ఆ దేశం 26% సుంకాలు వసూలు చేయనుంది. దీంతో ఎగుమతిదారులపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుంది. ఇవాళ భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా టారిఫ్స్‌తో ఇప్పటికే రోజుకు $2 బిలియన్ల కలెక్షన్లు వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

టారిఫ్‌ల విషయంలో కొన్ని దేశాలు తనను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ప్లీజ్.. ప్లీజ్ సార్. మీతో ఎలాంటి డీల్‌కైనా సిద్ధం. ఇందుకోసం ఏమైనా చేస్తాం అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి. అయినా నేను అన్నీ తెలిసే టారిఫ్‌లను విధించా. వీటిని మళ్లీ పున:సమీక్షించే ఛాన్సే లేదు. సుంకాల దెబ్బకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి

Tags

Next Story