US: భారత్-ఈయూ డీల్ నిరాశ పరిచింది..: అమెరికా

భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా ఒప్పందంపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం తమన తీవ్రంగా నిరాశ పరిచిందని వ్యాఖ్యానించారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఈయూ ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. యూరోపియన్ నాయకులు మిత్ర ధర్మాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. భారత్-ఈయూ ఒప్పందం అమెరికా ప్రయోజనకాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. దేశాలు తమకు తాముగా ఏది ఉత్తమమో అది చేయాలని హితవు పలికారు.
ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో యూరప్ చర్యల పట్ల చాలా నిరాశ చెందినట్లు చెప్పారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకం విధించామని.. ఇప్పుడేం జరిగిందో చూడండి.. భారత్‌తో యూరోపియన్లు సంతకం చేశారన్నారు. అమెరికాతో కాకుండా భారత్‌తో చేతులు కలపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఒప్పందంతో ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలు ఐరోపాకు ముఖ్యమని తేలిపోయిందన్నారు.
ఇటీవలే భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల చర్చల తర్వాత ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’గా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
