Deepfake: డీప్ ఫేక్‌పై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్ ఫేక్ టెక్నాలజీ ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అత్యంత భయంకర డీప్ ఫేక్ ప్రభావం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పైనే పడింది. ఆయన వాయిస్’ను అనుకరిస్తూ కొందరు మోసగాళ్లు ఆర్టిఫిషియల్ బేస్డ్ ఫోన్ కాల్స్ సృష్టించి తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దీంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ‘ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్’పై నిషేధాజ్ఞలు విధించినట్లు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తెలిపింది.
ఈ నేపథ్యంలో ‘ఏఐ- ఆధారిత వాయిస్ రోబోకాల్స్’పై నిషేధం విధించింది. ఈమేరకు ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘కొంతమంది నేరగాళ్లు కృత్రిమమేధ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వాయిస్ రోబోకాల్స్‌ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఆడియో, వీడియో కాల్స్‌ను సృష్టించినా.. ఇప్పుడు ఉన్న అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఇలాంటి ఫేక్ రోబోకాల్స్ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి’’ అని ఎఫ్‌సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ తెలిపారు.తక్షణం ఏఐ బేస్డ్ రోబోకాల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఎఫ్సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్స్ తెలిపారు.
ఇందులో భాగంగానే ఏఐ ఆధారిత రోబో కాల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిషేధం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఏ కంపెనీ అయినా ఇలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇటీవల న్యూ హ్యాంప్ షైర్ లో జరిగిన డెమోక్రాట్ ప్రైమరీ ఎన్నిక విషయంలో బైడెన్ ను అనుకరిస్తూ నకిలీ రోబో కాల్స్ వచ్చాయి. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటేయొద్దని ఆ కాల్స్ లో చెప్పినట్లు కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్‌లో కూడా సినీతారల విషయంలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోల గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. డీప్‌ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com