Thailand : భార్య కోసం భారత్‌కు పడవపై .. నీ ప్రేమకి హ్యాట్సాఫ్ గురూ..!
Thailand : కరోనా, లాక్‌డౌన్ వలన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ కూడా ఓ యువజంట కూడా కరోనా వలన ప్రత్యక్షంగా కలుసుకోవడానికి రెండేళ్ళకి పైగా టైం పట్టింది. కరోనా లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలు, ఉద్యోగం సంబంధిత కారణాల వలన తన భార్య ముంబైలో ఉంటే.. ఆమె భర్త మాత్రం విదేశాల్లో ఉండిపోయాడు.. తన భార్యని కలవాలని అనుకోని రోజు లేదు.. ఈ ఎడబాటును ఏ మాత్రం భరించాలేని ఆ భర్త.. తన భార్య కోసం ఏకంగా సహసయాత్రకే శ్రీకారం చుట్టాడు.
హో హొయాంగ్ హుంగ్ అనే వ్యక్తి ముందుగా వియత్నాం నుంచి థాయ్లాండ్వచ్చాడు. అక్కడ ఎయిర్పోర్ట్‌కి వెళ్ళాడు... ముంబైకే టికెట్ కొనాలని అనుకున్నాడు కానీ.. అతని దగ్గర వీసా లేకపోవడంతో విమానం ఎక్కే ఛాన్స్ లేదు.. దీనితో ఆ ప్రయాణాన్ని వద్దనుకొని బ్యాంకాక్‌లో బస్‌ఎక్కి ఫుకెట్ చేరుకున్నాడు.. ఇక్కడే తన సాహసమైన యాత్రని ప్రారంభించాడు. ఫుకెట్‌లో ఓ చిన్న పడవను కొన్నాడు.. నిజానికి అది ఓ రబ్బరు షీటు. గాలి కొడితే పడవలా మారుతుంది అంతే.
రంధ్రం పడితే ప్రాణాలు పోవడమే ఇక.. హుంగ్ కొన్న పడవకు ఇంజిన్‌లు, మోటర్‌లు వంటివి ఏమీ లేవు. తెడ్డు ఊపితేనే ముందుకు సాగుతుంది. ఇదో పెద్ద రిస్క్ కూడా.. కానీ అతను ఏ మాత్రం జంకలేదు.. ఆ రబ్బరు పడవతోనే 2 వేల కిలోమీటర్ల తన ప్రయాణాన్ని మొండిగానే మొదలుపెట్టాడు. ప్రయాణంలో పడవ అప్పుడప్పుడు అక్కడక్కడే తిరిగింది. కొన్నిసార్లు అయితే వెనుకకూ వెళ్లింది. అలా 18 రోజుల పాటు అతను ప్రయాణించింది కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే.
అలా ముందుకు సాగుతున్న హుంగ్.. మార్చి 23న సిమిలన్ దీవుల వద్ద ఓ జాలర్ల బోటులోని వారి కంటపడ్డాడు. వారు అతన్ని కాపాడి తమ బోటులో ఎక్కించుకుని మళ్లీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిపోయారు. భార్య మీద ప్రేమ కోసం.. సముద్రపు లోతును కూడా లెక్క చేయని హుంగ్ గురించి థాయ్‌లాండ్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com