Viral Escape Video: .. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య ..ఆ తర్వాత ఏం జరిగిందంటే

వివాహితుడైన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో అతని భార్య అకస్మాత్తుగా రావడంతో ఓ మహిళ ప్రాణాలకు తెగించింది. తప్పించుకునే క్రమంలో ఏకంగా 10వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించింది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన.
ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ఇంట్లో ఉండగా హఠాత్తుగా అతని భార్య వచ్చింది. దీంతో కంగారుపడిన ఆ వ్యక్తి, ప్రియురాలిని బాల్కనీలో దాక్కోమని చెప్పాడు. కిందకు చూస్తేనే కళ్లు తిరిగేంత ఎత్తులో ఉన్న బాల్కనీ రెయిలింగ్‌ను పట్టుకుని ఆ మహిళ వేలాడింది. ఆ తర్వాత భవనం బయట ఉన్న పైపులు, కిటికీ అంచులను పట్టుకుంటూ జాగ్రత్తగా కిందకు దిగడం ప్రారంభించింది.
ఈ భయానక దృశ్యాలను కింద ఉన్నవారు భయాందోళనలతో చూశారు. కొంత దూరం కిందకు దిగాక, ఆమె ఓ ఇంటి కిటికీని తట్టి సహాయం కోరింది. ఆ ఇంటి యజమాని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే కిటికీ తెరిచి ఆమెను లోపలికి లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రియుడిని పిరికివాడంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అయితే, మహిళ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోగా, చాలామంది ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా ఇంతటి సాహసం చేయడం మూర్ఖత్వమని విమర్శించారు. "ఒక్క అడుగు జారినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఎవరి కోసమో ప్రాణాలను ఇలా పణంగా పెట్టడం సరికాదు" అని మరో యూజర్ కామెంట్ చేశారు.
కాగా, చైనాలో విడాకుల రేటు గణనీయంగా పెరుగుతోంది. 1998 నుంచి 2018 మధ్య విడాకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని అరికట్టేందుకు, విడాకులు కోరే జంటలకు ప్రభుత్వం 30 రోజుల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్‌ను తప్పనిసరి చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

