Vivek Ramaswamy : డోజ్ నుంచి వివేక్ రామస్వామి ఔట్

ట్రంప్ కొత్తగా ఏర్పాటు చేసిన DOGE నుంచి ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఈ శాఖ సృష్టికి సాయపడటం తనకు దక్కిన గౌరవమని, మస్క్ టీమ్ దానిని సమర్థంగా నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒహైయో స్టేట్ గవర్నర్ పదవికి పోటీచేయడంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’కు సాయపడతానన్నారు. H1B అంశంలో నల్లవారితో పోలిస్తే తెల్లవారు లేజీ అనడం ఆయనకు పొగపెట్టినట్టు సమాచారం. "డోజ్ ఏర్పాటులో వివేక్ రామస్వామి కీలక పాత్ర పోషించారు. ఆయన త్వరలో ఎలెక్టెడ్ ఆఫీస్‌కు పోటీ చేయాలనుకుంటున్నారు. అదే జరిగితే ఆయన డోజ్ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది" అని ట్రంప్ బృందం ప్రతినిధి అన్నా కెల్లీ తెలిపారు.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అత్యంత సన్నిహితుడిగానూ రామస్వామి గుర్తింపు పొందారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధిత్వానికి వివేక్ రామస్వామి పోటీపడి.. తర్వాత ట్రంప్‌కి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, రామస్వామిపై ప్రభుత్వ ఎఫిషియెన్సీ బృందం ప్రశంసలు కురిపించింది. డోజ్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com