Putin: ప్రధాని మోడీ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

Putin: ప్రధాని మోడీ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్ అమలు చేస్తోన్న విదేశీ విధానాలు అసాధారణమన్న పుతిన్

ప్రధాన మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం నేటి ప్రపంచంలో కష్టసాధ్యమైనది అన్నారు. భారత్‌ సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి, ప్రగతి ప్రధాని మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమయ్యాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి, ప్రగతి సాధిస్తున్న దేశం భారత్‌ అని పేర్కొన్నారు. కేవలం ప్రధాని మోదీ నాయకత్వం వల్లనే ఈ దశకు చేరగలిగిందని చెప్పారు. కాలిన్‌గ్రాడ్‌ ప్రాంతంలోని ఓ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఈమేరకు వివరించారు. మాస్కో... న్యూఢిల్లీ, భారత నాయకత్వంపై ఆధారపడవచ్చని స్పష్టం చేశారు. ఎందుకంటే భారత్‌ అంతర్జాతీయంగా రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరించదన్నారు. 150 కోట్ల జనాభా గల భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం హక్కని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఈ హక్కును గుర్తించారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో భారత్‌ ఎంతో ముందంజ వేసిందని, భారత్‌ ‘‘మేక్‌ ఇన్‌ ఇండియా’’ కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలతో పాటు రష్యా కూడా గుర్తించిందని చెప్పారు. భారత్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడి రష్యా నుంచే ఉన్నట్లు వివరిస్తూ... రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్‌ కంపెనీ ఒక ఆయిల్‌ రిఫైనరీ, గ్యాస్‌ స్టేషన్లు, ఓడరేవు తదితర వాటిలో 23 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు.

ప్రధాని నాయకత్వ పటిమవల్లే భారత్ ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చిందన్నారు. భారత్ ఎప్పుడూ ప్రపంచ వేదికలపై రష్యా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదని గుర్తు చేశారు. రష్యాపై ఇప్పటి వరకు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించలేదన్నారు. అందుకే ఆ దేశం పట్ల... నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన మేకిన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. భారత్‍కు అత్యంత ఎక్కువ పెట్టుబడులు రష్యా నుంచి వెళుతున్నాయన్నారు. ఇప్పటికే దాదాపు 23 బిలియన్ డాలర్లను భారత్‌లో రష్యా కంపెనీలు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా భారత్‌తో ఆటలొద్దని పశ్చిమ దేశాలకు పుతిన్‌ హెచ్చరిక జారీ చేశారు. "బయటి నుండి దాని రాజకీయాలపై ప్రభావం చూపడానికి సంబంధించిన భారతదేశంతో ఆటలు ఆడటం వల్ల భవిష్యత్తు లేదు" అని రష్యా నాయకుడు అన్నారు. మరోవైపు, భారత్‌కు గొప్ప సంస్కృతి ఉందన్నారు. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి తెలిపారు. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story