U.S.Trump : అమెరికాలో వీఆర్ఎస్!..ట్రంప్ మరో కీలక నిర్ణయం

U.S.Trump : అమెరికాలో వీఆర్ఎస్!..ట్రంప్ మరో కీలక నిర్ణయం
X

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత మొదలైంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ వీఆర్ఎస్ ప్రకటించిం ది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ప్రభు త్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అందులో పే ర్కొన్నారు. 20 లక్షల మంది ఉద్యోగులకు ఇందుకు సంబంధించిన మెయిల్ వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవ 8 6వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వెల్లడించారు. ఉద్యోగాలు మా నేద్దామని అనుకొని ఆగిపోయినవారు దీనిని ఎంచుకోవచ్చని సూచించింది. కొవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగు లు రిమోట్ విధానంలో పని చేస్తున్నా రు. తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది. ఆఫీసులకు రావడం ఇష్టం లేని వారు స్వచ్ఛంద ఉద్యోగ విరమణను ఎంచుకోవచ్చని సూచించింది. సుమారు 1015శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని అధికారు లు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉంది.

Tags

Next Story