WAR: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్‌పై ముప్పేట దాడి మొదలైంది. పలుమార్లు ఇరాన్‌ను హెచ్చరించిన అమెరికా.. ఇరాన్‌లోని అణు ఆయుధ కేంద్రాలపై శనివారం అర్ధరాత్రి దాడులు చేసింది. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఫోర్డోలోని భూగర్భ అణు స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు ఆరు బంకర్ బస్టర్ బాంబులు వాడింది. నాటాంజ్, ఇస్ఫహాన్‌లపై దాడికి 30 టొమాహాక్ క్షిపణుల ప్రయోగించింది.
బీ-2 స్టెల్త్ బాంబర్ అంటే ఏంటి?
అమెరికా వాయుసేనకు చెందిన బీ-2 స్టెల్త్ బాంబర్ ఓ ప్రత్యేకతలు గల యుద్ధ విమానం. 1989లో తొలిసారిగా అమెరికా ఈ బాంబర్‌ను వాడింది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా స్టెల్త్ సాంకేతికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ విమానం శత్రుదేశాల రాడార్లను కనిపించకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన విమానాల్లో ఇది ఒకటిగా ఉండటం విశేషం. నార్త్రప్ గ్రమ్మన్ అనే అమెరికా సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది భూగర్భంలో ఉన్న స్థావరాలను సైతం విజయవంతంగా ధ్వంసం చేసే సామర్థ్యం ఉంటుంది. దీనికి చాలా తక్కువ రాడార్ సిగ్నల్ ఉంటుంది. చిన్న పక్షి మాదిరిగా కనిపిస్తుంది. 6వేల నాటికల్ మైల్స్ దూరం ప్రయాణించడంతో పాటు దూరం ప్రయాణించగలదు. శక్తివంతమైన ఆయుధాలను మూసుకెళ్లగల సత్తా దీనికి ఉంది. ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై దాడులకు పాల్పడింది. అవి భూగర్భంలో ఉండడంతో పెద్దగా నష్టం జరగలేదు. కానీ, భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్ వద్ద లేదు. ఇలాంటి తరుణంలో అమెరికా రంగ ప్రవేశం చేసింది. ప్రత్యేకంగా భూగర్భ స్థావరాల కోసం రూపొందించిన 30వేల పౌండ్ల మాసివ్ ఓర్డినెన్స్ పెనెట్రేటర్ (బంకర్ బస్టర్ బాంబులు) బీ-2 బాంబర్ ద్వారా ప్రయోగించింది.బంకర్ బస్టర్లు భూగర్భంలో ఉన్న గుహలను, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకునే శక్తివంతమైన బాంబులు.
ఒక్కో బాంబు బరువు 13,600 కిలోలు
వాస్తవానికి ఇరాన్‌లోని ఫోర్డోపై 13,600కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అమెరికా భావించింది. కానీ ఈ ఆపరేషన్‌లో ఏకంగా ఆరు బాంబులను ప్రయోగించింది. 20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకొంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలతాయి. ఈ బాంబు బరువులో సుమారు 80 శాతం అత్యంత పటిష్ఠమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో రెండు టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది.
చోమాహాక్ క్షిపణులు కూడా...
నటాంజ్, ఎస్ఫాహాన్లోని మిగతా రెండు అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. ఈ దాడుల లక్ష్యం ఇరాన్ అణు విధానాన్ని పూర్తిగా నాశనం చేయడమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడులు అమెరికా సైనిక సామర్థ్యాన్ని, స్టెల్త్ టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటాయని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ అణు వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఈ దాడులు ఇరాన్ అణు సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు, మధ్య ప్రాచ్యంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. అమెరికా చర్యను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వాగతించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com