Trump : యుద్ధం మళ్లీ జరగొచ్చు: ట్రంప్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పులు విరమణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లైట్ తీసుకున్నారు. నాటో సదస్సు నేపథ్యంలో విలేకరులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి ఆయన్ను ఇరు దేశాల మధ్య ఘర్షణ ముగిసిందని ఏ నమ్మకంతో మీరు చెబుతున్నారు అని ప్రశ్నించగా కాల్పుల విరమణకు చట్టబద్ధత ఉందని, తాను ఇరుపక్షాలతో వ్యవహరించినట్టు బదులిచ్చారు. తన సమాధానాన్ని పొడిగిస్తున్నట్టుగా ఉభయులు చాలా చాలా తీవ్రంగా పోరాడారు. అలసిపోయారు. సంతృప్తి చెందారు. ఘర్షణకు ముగింపు పలికి ఇళ్లకు తిరిగి వెళ్లారు. మరి అది (ఘర్షణ) మళ్లీ మొదలవుతుందా? అని అడిగితే ఏదో ఒకరోజున లేదా అతి త్వరలో మొదలు కావొచ్చని నేను ఊహిస్తున్నాను అని తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్లో దెబ్బతిన్న అణు కేంద్రాలను ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ ఏజెంట్లు సందర్శించారని ట్రంప్ తెలిపారు. అవి పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ మేరకు ఇజ్రాయెల్ ఒక నివేదికను తయారు చేస్తోందని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com