Warren Buffett : వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్

Warren Buffett : వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
X

ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు వయసు మీద పడటంతో తన వారసుడిని ప్రకటించారు. రెండవ కొడుకు హువర్డ్ బఫెట్ తన బెర్క్ షైర్ కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలియజేశారు. 94 ఏళ్ల వయసు గల వారెన్ బఫెట్ వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం వారెన్ వ్యాపార సామ్రాజ్యం విలువ దాదాపు రూ.86 లక్షల కోట్లు. తన సంపదలో అధిక మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఛారిటబుల్ ట్రస్టుకు ఇస్తున్నట్టు, తన ముగ్గురి పిల్లలకు చాలా కొద్ది మొత్తం మాత్రమే వాటా ఇస్తున్నట్టు తెలిపారు. ఇక హువర్డ్ బెర్క్ షైర్ బోర్డులో 30 ఏళ్లుగా పని చేశారు. వారెన్ నిర్ణయంపై హువర్డ్ స్పందిస్తూ.. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నానని, దీనికోసమే ఇన్నేళ్ల నుంచి మా తండ్రి నన్ను సిద్ధం చేశారని, ఆయన నేర్పించిన పాఠాలు నాకెంతో విలువైనవి అన్నారు.

Tags

Next Story