Chinese Research : చంద్రుడిపై నీటి ఆనవాళ్లు.. చైనా పరిశోధకుల వెల్లడి
చంద్రుడిపై అన్వేషణకు భారత్ సహా వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా.. నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంలో అందులో నీటి జాడ ఉన్నట్లు తెలిపింది. తమ శాస్త్ర వేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
చంద్రుడిపై మట్టినమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం ఇటీవల విజయవమంతమైంది. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. అనంతరం వాటిపై బీజింగ్ నేషనల్ లేబొ రేటరీ ఫర్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, సీఏఎస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణు వులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని సీఏఎస్ ఇటీవల తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్ లో ప్రచురించినట్టు చెప్పింది.
అమెరికా, రష్యా తర్వాత జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. అయితే, 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com