Pakistan : 214 మంది పాక్ సైనికులను చంపేశాం

తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇందుకోసం తాము ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో బందీలుగా ఉన్న 214 మంది సైనికులను చంపేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోవాలని కోరుకునే వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రైల్వే ట్రాక్లను పేల్చివేసి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసింది . ఈ రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది. బందీలను విడిపించేందుకు ఆపరేషన్ ప్రారంభించిన పాకిస్తా న్ సైన్యం, 30 గంటల ఆపరేషన్లో 33 మంది తిరుగుబాటుదారులు మరణించిన తర్వాత బుధవారం ముట్టడి ముగిసిందని తెలిపింది. ఈ దాడిలో 23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు మరణించారని సైన్యం ప్రకటించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో తమ ఆపరేషన్ ముగిసిందని పాక్ సైన్యం చేసిన ప్రకటనను బలూచ్ లిబరేషన్ ఖండించింది. పాకిస్తాన్ వాదనను తిప్పికొడుతూ, తీవ్రమైన పోరాటం సాగుతోందని, భద్రతా దళాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపింది. పాకిస్తాన్ తన సాంప్రదాయ మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శిస్తూ, తీవ్రమైన చర్చలను తప్పించుకోవడమే కాకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా విస్మరించింది. ఈ మొండితనం ఫలితంగా, 214 మంది బందీలను ఉరితీశాం అని బీఎల్ఎ తెలిపింది. ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతులకు పని చెప్పామని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com