China : రష్యాతో మేం చేయొద్దు.. కానీ మీరు వ్యాపారం చేయొచ్చా..? చైనా విమర్శలు

China : రష్యాతో మేం చేయొద్దు.. కానీ మీరు వ్యాపారం చేయొచ్చా..? చైనా విమర్శలు
X

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ప్రపంచానికి వరుస షాకులు ఇస్తున్నాడు. ఎడాపెడా టారీఫ్‌లు పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై భారీగా సుంకాలు విధిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్, చైనాలపై పన్నులతో విరుచుకపడ్డారు. వీటిపై చైనా ఘాటుగా స్పందించింది. రష్యాతో అమెరికానే వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని ఐక్యరాజ్యసమితిలోని బీజింగ్‌ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్‌ షువాంగ్ అన్నారు.

అమెరికా ఆరోపిస్తున్నట్లు రష్యాకు ఎలాంటి ఆయుధాలను అందించలేదని చైనా ప్రతినిధి స్పష్టం చేశారు. రష్యాతో పాటు ఉక్రెయిన్‌తో కూడా సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే తాము సంబంధాలు సాగిస్తున్నామని.. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని వివరించారు. అమెరికానే ఇప్పటివరకు రష్యాతో వాణిజ్యం కొనసాగించిందని ఆరోపించారు. ఇతర దేశాలు వాణిజ్య సంబంధాలు కొనసాగించకూడదు కానీ.. మీరు చేయొచ్చా అంటూ అగ్రరాజ్యాన్ని సూటీగా ప్రశ్నించారు. ఇతరులపై నిందలు వేసి బలిపశువులను చేయడం మాని.. కాల్పుల విరమణ, కీవ్‌లో శాంతి నెలకొల్పడం అనే అంశంపై దృష్టి పెట్టాలని అమెరికాకు సూచించారు.

Tags

Next Story