Pakistani Leader : సింధులో భారతీయుల రక్తం పారిస్తాం.. రెచ్చిపోయిన పాకిస్థానీ నేత

Pakistani Leader : సింధులో భారతీయుల రక్తం పారిస్తాం.. రెచ్చిపోయిన పాకిస్థానీ నేత
X

అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌ ఘటనపై భారత్‌ తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్‌ విలవిల్లాడుతోంది. దాంతో భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాకిస్థానీ పొలిటికల్ లీడర్లు దిగుతున్నారు. పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ దుర్ఘటనకు పాక్‌ను దోషిని చేస్తున్నారని, వారి నిస్సహాయతను కప్పి పుచ్చుకోవడానికి మనల్ని నిందిస్తున్నారని ఆరోపించారు. అకారణంగా సింధు నదీ జలాలను నిలిపివేశారని, సింధూ నది పాకిస్థాన్‌కు చెందినదని పేర్కొన్నారు. అందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఆ నదిలో నీళ్లు పారాలి లేదంటే వారి నెత్తురు పారుతుందని సుక్కూర్ సభలో భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story