US–Israel : భగ్గుమంటున్న పశ్చిమాసియా.. భారత్ వైపు యుద్ధమేఘాలు..?

US–Israel : భగ్గుమంటున్న పశ్చిమాసియా.. భారత్ వైపు యుద్ధమేఘాలు..?
X

పశ్చిమాసియా దేశాలు యుద్ధమేఘాలతో అల్లకల్లోలం అవుతున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని మొదలుపెట్టినప్పుడే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశాయి. దాంతో ఇరాన్ లో పాలన మారుతుందని యుద్ధం ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ యుద్ధం ఏడో రోజుకు చేరింది. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక శక్తిని ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్ కు లేకపోయినా.. తన శక్తికి మించి పోరాడుతుందే గాని లొంగి పోవట్లేదు. ఇప్పటికే గల్ఫ్ దేశాలను ఇరాన్ అతలాకుతలం చేస్తోంది. వరుస దాడులతో గల్ఫ్ దేశాలను నిలువునా వణీకిస్తోంది. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి కోసం వెళ్ళిన వారు ఉన్నారు. మన దేశ ప్రధాని ఇప్పటికే ఆయా దేశాలతో మాట్లాడుతూ భారతీయుల భద్రత కోసం ఏర్పాటు చేయిస్తున్నారు. కానీ ఇరాన్ దూకుడు మాత్రం అస్సలు తగ్గట్లేదు.

మొన్ననే భారత్ కు అతి దగ్గరలో ఇరాన్ నౌకను అమెరికా పేల్చేసింది. దాంతో ఇరాన్ శ్రీలంకతో మాట్లాడి మరో యుద్ధ నౌకను తెప్పించింది. చూస్తుంటే ఈ యుద్ధం కాస్తా భారత్ సరిహద్దుల దాకా వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా భారత్ పోర్టులను వాడుకుంటుంది యుద్ధం కోసం అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. మాజీ పెంటగాన్ అధికారి అమెరికా మీడియాతో మాట్లాడుతూ యూఎస్ భారత్ పోర్టులను వాడుకుంటుందని ప్రకటించారు. దీన్ని ఇండియా ఖండించింది. కానీ ఇలాంటి వార్తలు భారత్ కూడా అమెరికాకు సహకరిస్తున్నట్టు ఇరాన్ అనుకునే ప్రమాదం లేకపోలేదు.

అయితే హార్మోజ్ జలసందిని మూసేస్తున్నట్టు ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. అక్కడి నుంచి ఏ దేశానికి చమురును వెళ్ళనివ్వమని నౌకలను పేల్చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ రకమైన సంకేతాలు ఇండియాలో తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ యుద్ధంలోకి మిగిలిన దేశాలను కూడా లాగాలని అమెరికా ఇజ్రాయిల్ చూస్తున్నాయి. యుద్ధం సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. భారత్ మాత్రం శాంతిని కోరుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరి భారత్ సరిహద్దుల దాకా వస్తున్న యుద్ధమేఘాలు ఎటువైపు దారితీస్తాయో అనేది వేచి చూడాలి.

Tags

Next Story