ఇజ్రాయెల్ తొందరపాటు.. యుద్ధం ఆగడం కష్టమేనా..?

పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతుంది. మొన్న రాత్రి ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ను రాత్రికి రాత్రి తుడిచి పెట్టేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. కానీ కొద్ది గంటల్లోనే పరిణామాలు మారిపోయాయి. రెండు వారాలపాటు యుద్దానికి బ్రేక్ ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అటు ఇరాన్ కూడా హర్మూజ్ జలసంధినీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇంతలోనే ఇజ్రాయెల్ తొందరపడింది. లెబనాన్ మీద భారీ దాడులతో విరుచుకుపడింది.
గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో దాడులు చేయడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాము కూడా ఇజ్రాయెల్ మీద భీకరంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. వెంటనే హార్మోజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచమంతా మళ్లీ అయోమయంలో పడిపోయింది. దెబ్బకు యుద్ధంపై మళ్లీ అనుమానాలు పెరిగిపోయాయి.
చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించట్లేదు. అదే జరిగితే ప్రపంచం మళ్లీ సంక్షోభంలో పడిపోవడం ఖాయం అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇప్పటికే నడుస్తున్నట్టు తెలుస్తోంది. యుద్ధం ఆగే విధంగా రెండు దేశాల మధ్య శాంతి కోసం ఈ చర్చలు సఫలమైతే ప్రపంచానికి పెద్ద ఊరట లభించినట్లు అవుతుంది. కానీ మధ్యలో ఇజ్రాయెల్ ఎలాంటి దూకుడు ప్రయత్నించినా సరే అది ఒప్పందం రద్దు దిశగా తీసుకువెళుతుంది అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
- West Asia conflict
- Middle East war
- Donald Trump
- United States
- Iran
- Israel
- Lebanon
- Strait of Hormuz
- Iran-Israel tensions
- US-Iran relations
- global oil supply
- geopolitical crisis
- ceasefire talks
- international diplomacy
- global security
- war escalation
- peace negotiations
- geopolitical instability
- energy crisis
- world economy
- international relations
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
