Israel : రగులుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్‌పై ఆగని ఇరాన్ దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడితో పశ్చిమాసియా మొత్తం నిప్పుల గుండంలా మారింది. ఏ క్షణాన ఏం జరగబోతుందన్న టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఇరాన్ దాడిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ సీరియస్ గా స్పందించారు. "ఇరాన్ నాయకులు తమ బలాన్ని, ప్రతిదాడి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. వారు అర్థం చేసుకొనేలా ప్రతి దాడి చేస్తాం" అన్నారు. దీంతో.. ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం ఇప్పుడు గగుర్పాటు రేపుతోంది.
అటు.. టెల్‌అవీన్‌పై దాడుల వెనుక, ఆ ప్రాంతంలో అస్థిరత్వానికి ఇరాన్ సుప్రీం లీడరే కారణం అని ఇజ్రాయెల్ సైనికాధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఐడీఎఫ్ గురి ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీపై ఉన్నట్టు తెలుస్తున్నది. ఇరాన్‌పై దాడిచేసే క్రమంలో ఆ దేశానికి ఆయువు పట్టులా ఉన్న ఆర్థిక, కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీసే అవకాశాలున్నాయి. చమురు, గ్యాస్, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలే ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com