Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎక్కడ?

సెయింట్ మార్టిన్ ద్వీపకల్పం కోసమే బంగ్లాదేశ్‌లో US చిచ్చు పెట్టిందని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. ఇప్పుడు ఆ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌కు దక్షిణాన బంగాళాఖాతంలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో ఇది ఉంది. 1900లో బ్రిటిష్ వారు దీనికి సెయింట్ మార్టిన్ అని పేరు పెట్టారు. తొలుత INDలో భాగంగా ఉండేది. 1947లో పాక్‌కు, 1971 యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు దక్కింది. ఇక్కడ 3,700 మంది నివసిస్తున్నారు.
ఈ ద్వీపకల్పం బంగాళాఖాతంలో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్‌కు దగ్గరలో ఉంది. చైనాతో వివాదం నేపథ్యంలో బంగాళాఖాతంలో పాగా కోసం ప్రయత్నిస్తున్న US చూపు సెయింట్ మార్టిన్‌పై పడింది. ఇక్కడ సైనిక స్థావరం నిర్మిస్తే అటు చైనాపై కన్ను వేయడంతోపాటు మలక్కా జలసంధిపై పట్టు లభిస్తుందని ఆ దేశం భావిస్తోంది. దానికి తాను ఒప్పుకోకపోవడంతోనే బంగ్లాలో అల్లర్లను అమెరికా ప్రోత్సహించిందని హసీనా ఆరోపించగా, వైట్‌హౌస్ ఖండించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com