USA : అక్రమ వలసదారుల సంకెళ్ల వీడియో షేర్ చేసిన వైట్ హౌస్

అక్రమ వలసదారుల తరలింపు విషయంలో అమెరికా తన అమానవీయ వైఖరిని గట్టిగా సమర్థించుకుంటోంది. భారతీయుల విషయంలోనూ ట్రంప్ సర్కారు ఇలాగే వ్యవహరించింది. చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో నిర్బంధించి, సైనిక విమానంలో కుక్కేసి పంపింది. ఈ తరహా తరలించడం పట్ల భారత్ సహా పలు దేశాలు అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా వైట్ హౌస్ షేర్ చేసిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో అగ్రరాజ్యం అధికారులు వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తూ కనిపించారు. అనంతరం వారిని విమానంలోకి ఎక్కించారు. ఇది చూసిన నెటిజన్లు అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై ట్రంప్ పాలకవర్గంలో కీలక సలహాదారు ఎలాన్ మస్క్ స్పందించారు. 'వావ్' అంటూ వీడియోని రీపోస్ట్ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఇటీవలే స్వదేశానికి పంపారు. మూడు విడతల్లో మొత్తంగా 332 మందిని అమృత్ సర్ కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com