Akshata Murthy: నాలుగేళ్ల ప్రేమ.. నాన్న ముందు ఒప్పుకోలేదు: అక్షతా మూర్తి

Akshata Murthy: నాలుగేళ్ల ప్రేమ.. నాన్న ముందు ఒప్పుకోలేదు: అక్షతా మూర్తి
Akshata Murthy: తండ్రి ఓ పెద్ద ఐటీ సంస్థకు అధినేత అయినా, భర్త ప్రముఖ రాజకీయ వేత్త అయినా వారి పేరు చెప్పుకుని ఎదగాలనుకోలేదు..

Akshata Murthy: ఐటీ రంగంలో అగ్రగాములు.. అయినా అమ్మాయి విషయంలో సాధారణ తల్లిదండ్రుల్లానే ఆలోచించారు.. అయితే రిషి సునక్‌తో మాట్లాడిన తరువాత అతడేంటో తెలిసింది. మంచి వ్యక్తిని ఎంపిక చేసుకుందని మారు మాట్లాడకుండా మూడు ముళ్లకు ముహుర్తాలు పెట్టించారు అక్షత తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధా మూర్తిలు.

తండ్రి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపార వేత్త అయినా, భర్త ప్రముఖ రాజకీయ వేత్త అయినా వారి పేరు చెప్పుకుని ఎదగాలనుకోలేదు.. తనకంటూ ఓ స్వంత గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు అక్షత. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి తిరుగులేని ముద్ర వేశారు. ఎన్నో ఏళ్ల క్రితమే విదేశాల్లో స్థిరపడ్డా భారతీయ మూలాలు మరిచిపోకుండా జీవిస్తున్నారు.

తన బాల్యం అంతా నానమ్మ తాతయ్యల దగ్గరే గడిచింది. నెలల వయసున్న అక్షతను కర్ణాటక హుబ్లీలో వదిలి సుధా, నారాయణమూర్తి ముంబయి వెళ్లిపోయారు.. కెరీర్ ఒక గాడిన పడే వరకు కూతుర్ని తల్లిదండ్రుల వద్దే ఉంచారు నారాయణమూర్తి.

1981లో ఇన్ఫోసిస్ స్థాపించిన తరువాత ఏ మాత్రం సమయం చిక్కినా పిల్లలతో గడపడానికే ఎక్కువ ఇష్టపడేవారు భార్యాభర్తలిద్దరూ. సంస్థ అంచలంచెలుగా ఎదిగింది.. సంపద కూడా పెరిగింది. అయినా నారాయణమూర్తి పిల్లలను క్రమశిక్షణతో పెంచారు. ఆటో రిక్షాలోనే స్కూలుకు పంపించేవారు.. తమ చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందించే వారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని నేర్పించారు.

లాస్ ఏంజెల్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన అక్షత కొన్నాళ్లపాటు డెలాయిట్, యూనిలీవర్ కంపెనీల్లో పని చేశారు. ఆపై ఎంబీఏ కోసం స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చేరారు. అక్కడే రిషీ సునక్ పరిచయమయ్యారు. నాలుగేళ్ల ప్రేమ తరువాత నాన్న నారాయణమూర్తితో చెప్పింది రిషిని పెళ్లి చేసుకుంటానని.. మొదట ఒప్పుకోలేదు.. రిషీతో మాట్లాడిన తరువాత తనపై మంచి ఒపినీయన్ వచ్చింది. అలా 2009లో రిషీ సునక్‌తో, అక్షత్ వివాహం జరిగింది. వారి గారాల పట్టీలు ఇద్దరు అనౌష్క, కృష్ణ.

పెళ్లికి రెండేళ్ల ముందే 2007లో అక్షతా డిజైన్స్ పేరుతో సొంత లేబుల్‌ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి తనకు ఫ్యాషన్‌పై మక్కువ ఉండడంతో దాన్నే కెరీర్‌గా మలుచుకున్నారు అక్షత. ఆమె డిజైన్ చేసిన దుస్తులు అంతర్జాతీయ వేదికలపై మెరిశాయి. అయితే వివిధ కారణాలవల్ల 2012లో తన సంస్థను మూసేసి తన తండ్రి స్థాపించిన ఇన్ఫోసిస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఆమెకు 0.93% విలువ గల షేర్లు ఉన్నాయి.

మరోవైపు తన సోదరుడు ప్రారంభించిన ఫిట్‌నెస్ కంపెనీ Digme Fitness కు డైరెక్టర్‌గా కొనసాగుతోంది అక్షత. ఇవి కాకుండా యూకేకు చెందిన పలు ప్రముఖ వ్యాపారాల్లో ఆమెకు వాటా ఉంది. ఇక రిషీ కూడా పార్లమెంటులోకి అడుగు పెట్టడానికి ముందు తన పేరిట ఉన్న ఆస్తులన్నీ తన భార్య అక్షత పేరు మీద బదిలీ చేశారు. ఇవన్నీ కలుపుకుంటే అక్షత సంపద బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2ను దాటేసిందని ఇటీవల ఒక జాతీయ పత్రిక వెల్లడించింది. క్వీన్ ఆస్తుల విలువ 400 మిలియన్ డాలర్లు అయితే.. అక్షత ఆస్తుల విలువ 900 మిలియన్ డాలర్లు.

తల్లిదండ్రుల మాదిరిగానే సింపుల్‌గా, హూందాగా వ్యవహరిస్తుంటుంది అక్షత. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న తన భర్త రిషితో మాట్లాడేందుకు ఇంటి బయట వేచి ఉన్న జర్నలిస్టులకు స్వయంగా ఆమే టీ బిస్కట్లు అందించి తన మంచి మసు చాటుకున్నారు. దీంతో జర్నలిస్టులు ఆమె సింప్లిసిటీని ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story